Home Page SliderInternational

లింక్డిన్‌కు పోటీగా కొత్త ఫీచర్‌తో ట్విటర్

Share with

ఇకపై ట్విటర్‌లో కేవలం కామెంట్సే కాదు, ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా రాబోతున్నాయి. లింక్డిన్‌కు పోటీగా కొత్త ఫీచర్ తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది ట్విటర్. ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ తమ ఉద్యోగ నోటిఫికేషన్లను వారి ట్విటర్ ఫ్రొఫైల్స్‌లో పోస్ట్ చేయవచ్చు. దీనితో యూజర్లు ఎవరైనా ఆ కంపెనీకి సంబంధించిన ట్విటర్ ఎకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఉద్యోగ ఖాళీల సమాచారం వారికి తెలుస్తుంది. దీనితో అర్హత కలిగిన వారికి ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకునే అవకాశం కలుగుతుంది. ట్విటర్‌ను మస్క్ టేకోవర్ చేసిన తర్వాత మే నెలలో జాబ్ మ్యాచింగ్ టెక్ స్టార్టప్ లాస్కీని కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ ఫీచర్‌ను విడుదల చేయడానికి ఈ లాస్కీ బాగా ఉపయోగపడవచ్చని భావిస్తున్నారు.