Home Page SliderInternational

లీకైన ట్విటర్ సోర్స్ కోడ్

Share with

ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆయన ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ..దానిని ముందుకు తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం ట్విటర్ సోషల్ మీడియా దిగ్గజాలలో ఒకటిగా వుంది. కాగా దీనికి సంబంధించిన సోర్స్ కోడ్ లీకైనట్లు అమెరికా మీడియా తాజాగా వెల్లడించింది. అయితే ట్విటర్ నిర్వహణకు కీలకమైన ఈ సోర్స్ ‌కోడ్ లోని కొన్ని భాగాలను గిట్‌హబ్ అనే సైట్‌లో షేర్ చేయడం జరిగింది. దీంతో ఆ కోడ్ వెంటనే తొలగించాలని ట్విటర్ గిట్‌హబ్‌ను కోరింది.  కాగా గిట్‌హబ్ దానిని వారి సైట్ నుండి తక్షణమే తొలగించినట్లు తెలిపింది. ఈ సోర్స్ కోడ్‌ను “freespeechenthusiast” అనే ఐడీతో ఓ వ్యక్తి లీక్ చేసినట్లు ట్విటర్ గుర్తించినట్లు తెలిపింది. ట్విటర్‌పై ఈ విధమైన హ్యాకింగ్‌కు పాల్పడినందుకుగాను ఇతనిపై తగిన చర్యలు తీసుకోవాలని ట్విటర్ కాలిఫోర్నియాలోని జిల్లా కోర్టును ఆశ్రయించింది.