Andhra PradeshHome Page Slider

తిరుమల ఘాట్‌రోడ్‌లో వరుస ప్రమాదాలపై టీటీడీ నిర్ణయం

Share with

ఈ మధ్యకాలంలో తిరుమలలో భక్తుల రద్ధీ బాగా పెరిగిపోయింది. దానితో పాటే పెరుగుతున్న ఘాట్‌రోడ్‌లోని ప్రమాదాలు కూడా భక్తులను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ విషయంపై సీరియస్‌గా ఆలోచిస్తోంది టీటీడీ పాలక మండలి. మొన్న ఆదివారం ఒక్కరోజులోనే నాలుగు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. దీనితో ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మహా శాంతి హోమం చేయాలని సంకల్పించారు టీటీడీ బోర్డు. ఈ హోమాన్ని మొదటి ఘాట్ రోడ్‌లోని ప్రసన్న ఆంజనేయస్వామి గుడివద్ద ఈ హోమం చేయాలని నిర్ణయించారు. నిత్యం వేలాది వాహనాలలో స్వామివారిని దర్శించుకుంటారు లక్షలాదిమంది భక్తులు. తిరుమలలో కేవలం 12 వేల వాహనాలకే పార్కింగ్ అవకాశం ఉంది. కానీ శని, ఆది వారాలలో 30 వేల వాహనాలకు పైగా కొండపైకి వెళ్తున్నాయి వాహనాలు.

మొదటి ఘాట్ రోడ్డు 19.1 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 58 మలుపులు ఉంటాయి.  ఈ ప్రయాణానికి 40 నిముషాల సమయం తీసుకోవాల్సి ఉండగా, చాలామంది వాహన దారులు డౌన్ రోడ్ కావడంతో వేగంపై నియంత్రణ లేకుండా దూసుకువస్తున్నారు. వాహనాల మధ్య తగినంత దూరం లేకపోవడం కూడా ఈ ప్రమాదాలకు కారణం కావచ్చని అంటున్నారు. ఇక రెండవ ఘాట్ రోడ్ కూడా 18కిలోమీటర్ల పైనే ఉంటుంది. దీనిని అధిగమించడానికి 28 నిముషాల సమయం తీసుకోవాల్సి ఉండగా దానిని కూడా ప్రయాణికులు పట్టించుకోవడం లేదు. దీనితో వీటిని అరికట్టే చర్యలు తీసుకుంటూనే, భక్తుల భద్రత కోసం ఈ హోమాన్ని నిర్వహించాలనుకుంటున్నారు. టీటీడీ విజిలెన్స్ కూడా తనిఖీలు కొనసాగిస్తోంది.