Home Page SliderTelangana

తెలంగాణాలో TSRJC సెట్ నోటిఫికేషన్ విడుదల

Share with

తెలంగాణాలో ప్రస్తుతం ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కాగా మరికొన్ని రోజుల్లోనే 10 వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రారంభంకానున్నాయి. అయితే ఇప్పటికే 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హల్‌ టికెట్లను ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో 10 వ తరగతి విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరేందుకుఈ పరీక్ష తప్పనిసరి. దీంతో తెలంగాణాలోని 35 జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు తాజాగా TSRJC నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష కోసం మార్చి 31 వరకు ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. కాగా మే 6న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ tsrjdc.cgg.gov.in లో చూడవచ్చని అధికారులు తెలిపారు.