Home Page SliderInternational

17 భారత్ బహుమతుల వివరాలను వెల్లడించని ట్రంప్ ఫ్యామిలీ

Share with

వివాదాస్పద అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్.. మరోసారి వార్తల్లో నిలిచారు. అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో ఆయనకు వచ్చిన బహుమతుల వివరాలు చెప్పడంలో విఫలమైనట్టు కాంగ్రెస్ కమిటీ నిర్ధారించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా పర్యటన సందర్భంగా… ప్రధాన మోదీ, అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో సహా భారత నాయకులు నుంచి $47,000 విలువైన బహుమతులు పొందారు. వాటి విలువ సుమారుగా 40 లక్షల రూపాయలు. అదే సమయంలో… ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాధినేతల నుంచి… అమెరికా అధ్యక్షుడికి బహుమానంగా లభించిన $2,50,000 విలువైన బహుమతులు అంటే సుమారు 2 కోట్ల 6 లక్షల రూపాయల బహుమతులు వివరాలు అందించలేదని… కాంగ్రెస్ కమిటీ ఆక్షేపించింది.

ఈ నివేదిక ప్రకారం “సౌదీ కత్తులు, భారతీయ ఆభరణాలు, డోనాల్డ్ ట్రంప్ పెద్ద సాల్వడోరన్ చిత్రంతో సహా… పలు విదేశీ బహుమతుల లెక్క చెప్పడంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు విఫలమయ్యారని కమిటీ దుయ్యబట్టింది. విదేశీ బహుమతులు, అలంకారాల చట్టం ప్రకారం, పదవిలో ఉన్నప్పుడు విదేశీ ప్రభుత్వ అధికారుల నుండి బహుమతులను బహిర్గతం చేయాల్సి ఉన్నా… ఆయన ఆ పని చేయలేదని… దర్యాప్తు నివేదిక పేర్కొంది. రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్ 2017 నుంచి 2021 వరకు అమెరికా 45వ అధ్యక్షుడిగా పనిచేశారు. ట్రంప్, 76, 100 కంటే ఎక్కువ విదేశీ బహుమతుల వివరాలను అధికారులకు బహిర్గతం చేయడంలో విఫలమయ్యారు.

నవంబర్ 2021లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో… వస్తువులు మాయవడంపై… స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. కచ్చితమైన రికార్డులు లేకపోవడం, తగిన భద్రత కల్పించకపోవడంతో బహుమతులు పోయాయని అధికారులు పేర్కొన్నారు. ట్రంప్ కుటుంబానికి భారతదేశం నుండి 17 బహుమతులు లభించాయని వాటికి ఎలాంటి ఆధారాలు లేవని కమిటీ పేర్కొంది. ఆ వస్తువుల విలువ మొత్తం అంచనా $47,000. వీటిలో ట్రంప్‌కు యోగి ఆదిత్యనాథ్ $8,500 జాడీ, $4,600 తాజ్ మహల్ మోడల్, మాజీ రాష్ట్రపతి కోవింద్ $6,600 భారతీయ రగ్గు, ప్రధాని మోడీ $1,900 కఫ్‌లింక్‌లు ఉన్నాయి.