News

చంద్రబాబు కేసులో టాప్ 10 పాయింట్స్ (government version)

Share with

జీవోలో ఉన్న అంశాలు అగ్రిమెంట్ లో లేవు

చంద్రబాబు పీఏ పై జరిగిన ఐటీ రైడ్స్ లో ఫేక్ ఇన్వాయిస్ ద్వారా బాబుకు నిధులు మళ్లింపు జరిగినట్లు గుర్తింపు

స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఏపీ ఖాజానాను దోచేశారు: ఏఏజీ పొన్నవోలు సుధాకర్

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో కలిసి ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్‌లో రూ. 371 కోట్ల అవినీతి స్కిల్‌ ఫుల్‌గా జరిపించి.. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి లూటీ చేశారని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ స్కామ్‌లో మొత్తం 10 కీలక​ అంశాలు ఉన్నాయని సీఐడీ చీఫ్ సంజయ్ వెల్లడించారు.

“సీమెన్స్‌ ఏజీ అనే జర్మన్‌ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌ మీద ప్రేమతో.. రూ.3300 కోట్లు ఫ్రీగా సీమెన్స్ ఇస్తుంది అని చెప్పారు. ప్రభుత్వం కేవలం 10శాతం ఇస్తే సరిపోతుందన్నారు. ఎక్కడా కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ పెడతామని చెప్పాలేదు. కేబినేట్ అనుమతి లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఏపీ ఖాజానా నుంచి రూ.371కోట్లు డిజైన్ టెక్ కు నిధులు చెల్లించారు. అధికారుల ఆభ్యంతరాలను నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే పైలట్‌ ప్రాజెక్ట్‌ అమలు చేయాలన్న అధికారుల వాదనను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు”- ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి

జీవోలో ఉన్న అంశాలు అగ్రిమెంట్ లో లేవు

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో జీవో కంటే ముందే అగ్రిమెంట్ తయారీ అయ్యిందని, తప్పుడు పత్రాలతో ఒప్పందాలు చేశారని సీఐడీ చీఫ్ సంజయ్ తెలిపారు అగ్రిమెంట్‌లో జీవో నెంబర్‌ను చూపించలేదని జీవోలో ఉన్న అంశాలు అగ్రిమెంట్‌లో లేవని పేర్కొన్నారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో రూ.371 కోట్ల అవినీతి జరగిందని, నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లను రిలీజ్ చేశారని చెప్పారు. తప్పుడు డాక్యుమెంట్స్‌తో ఒప్పందాలు చేసుకున్నారని, ప్రభుత్వ జీవోలకు, అగ్రిమెంట్‌కు చాలా తేడాలు ఉన్నాయని అన్నారు. కార్పొరేషన్ ఏర్పాటులోనూ విధి విధానాలు పాటించలేదని, కార్పొరేషన్ నుంచి ప్రైవేటు వ్యక్తులకు డబ్బులు వెళ్లాయని ఆ ప్రైవేట్ వ్యక్తుల నుంచి షెల్ కంపెనీలకు మళ్లాయని వివరించారు.

చంద్రబాబు నాయుడు హయాంలో ఏర్పాటైన స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అవకతవకల గురించి మొదట పుణే నుంచి జీఎస్టీ అధికారులు గుర్తించి అప్పటి ఏపీ ప్రభుత్వానికి లేఖ ద్వారా అప్రమత్తం చేశారని ఏఏజీ పేర్కొన్నారు. 2018, మే 14వ తేదీన ఏపీ ఏసీబీ డీజీకి లేఖ రాశారని, అందులో రూ.371 కోట్లు నిధులు చేతులు మారాయని ప్రభుత్వాన్ని అలర్ట్ చేసినట్లు స్పష్టంగా ఉందని తెలిపారు. స్కాం కారకులనే పుణే జీఎస్టీ విభాగం అప్రమత్తం చేసిందన్న విషయం గమనించాలని అన్నారు. అందుకే వ్యవహారం ముందుకు సాగలేదని ఏఏజీ సుధాకర్‌రెడ్డి వివరించారు. వేరువేరు శాఖల ఫేక్ ఇన్వాయిస్ ద్వార నల్ల డబ్బు తెల్ల డబ్బుగా మార్చిన పీఏ, ఆయన అకౌంట్లో నుంచి చంద్రబాబు అకౌంట్లోకి నిధులు జమ అయ్యినట్లు ఆధారాలు దొరికాయని తెలిపారు.