Home Page SliderNational

విడాకులపై స్పందించిన టాలీవుడ్ హీరోయిన్

Share with

టాలీవుడ్ హీరోయిన్ అసిన్ తన భర్త రాహుల్‌తో విడాకులు తీసుకుంటున్నారని గతకొన్ని రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. కాగా ఆమె ఇటీవల తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి తన భర్త ఫోటోలను తొలగించారు. దీంతో అప్పటి నుంచి అసిన్ తన భర్త నుంచి విడిపోయారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే దీనిపై హీరోయిన్ అసిన్ తాజాగా స్పందించారు. ఆమె వీటిని పూర్తిగా కొట్టిపారేశారు. ఈ వార్తలు పూర్తిగా ఫేక్ అని హీరోయిన్ అసిన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను తన భర్త రాహుల్‌తో కలిసి సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నట్లు ఆమె ఇన్‌స్టాలో వెల్లడించారు. అయితే టూర్‌లో ఉండగా ఈ రూమర్ విని 5 నిమిషాలు నిరాశ పడినట్లు అసిన్ పేర్కొన్నారు.