News AlertTelangana

తెలంగాణ చరిత్ర నేటి తరానికి తెలియాలి : గవర్నర్ తమిళసై

Share with

తెలంగాణ విమోచన ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్న సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా హైదరాబాద్ విమోచన ఉద్యమ ఘట్టాలు, ఉద్యమంలో పాల్గొన్న వారి ఫోటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర ప్రభుత్వ కమ్యునికేషన్ విభాగం ఏర్పాటు చేసింది. ఈ నెల 18 వరకు నిర్వహించనున్న ఈ ఎగ్జిబిషన్‌ను గవర్నర్ తమిళ‌సై ఈ రోజు ప్రారంబించారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ 17ను విమోచన దినోత్సవంగానే జరుపుకోవాలని సూచించారు. సెప్టెంబర్‌ 17పై తెలంగాణ చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. తెలంగాణ ప్రజలపై జరిగిన వేధింపులను మర్చిపోలేమని అన్నారు. నాడు తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజలపై జరిగిన అకృత్యాలు, అఘాయిత్యాలను మర్చిపోలేమని ఆమె చెప్పారు. ఇదిలావుండగా సెప్టెంబర్‌ 17వ తేదీన ఏడాది పాటు జరిగే తెలంగాణ విమోచన ఉత్సవాలను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. ఈ వేడుకలో అమిత్ షా తెలంగాణ విమోచనం గురించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి మహరాష్ట్ర సీఎం ఫడ్నవీస్, కర్నాటక సీఎం హజరు కానున్నారు.