Andhra PradeshHome Page Slider

నారా లోకేష్ ‘చీటింగ్ మాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టకు’ తిరుపతి ఎంపీ

Share with

చీటీలు చదివి చీటింగ్ మాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టకు నారా లోకేష్, ప్రజలు మీ మాయమాటలు నమ్మే రోజులు పోయాయి అని మండిపడుతున్నారు  తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి. లోకల్ లీడర్లు రాసిచ్చిన చీటీలు చదవడం మానుకోవాలని హితవు పలికారు. అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలే బుద్ది చెప్పే సమయం ఆసన్నమైందని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా వెంకటగిరి పట్టణంలో జరిగిన సభలో మాట్లాడినవన్నీ పచ్చి అబద్దాలే అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వెంకటగిరి అభివృద్ధి గూర్చి పట్టించుకోలేదని, దోచుకోవడం దాచుకోవడం తోనే సరిపోయిందని ఎంపీ గురుమూర్తి ఎద్దేవా చేసారు.

వైసీపీ ప్రభుత్వ అభివృద్ధి

వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంపీ నిధుల నుండి వెంకటగిరి పట్టణంలో వెలుగులు నింపేందుకు రూ.1.05 కోట్లు ఎల్ఇడి లైట్ల కోసం కేటాయించి వెలుగులు నింపామని చెప్పారు. వెంకటగిరి పట్టణంలో సిమెంట్ రోడ్ల నిర్మాణం కోసం సుమారు రూ.13 లక్షలు, వెంకటగిరి నియోజకవర్గం బాలాయపల్లి మండలం కామకూరులో 8 లక్షల రూపాయలతో వాటర్ ప్లాంట్ నిర్మించామని తెలియజేసారు. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో రోడ్ల విస్తరణ, మరియు పటిష్టత కోసం కేంద్ర ప్రభుత్వం నుండి రూ.45 కోట్లు సిఆర్ఐఎఫ్ మంజూరు చేయించామని ఆయన అన్నారు. వెంకటగిరి రైల్వేస్టేషన్ దగ్గరలో జాతీయ రహదారి 565 పై హై- లెవెల్ బ్రిడ్జి నిర్మాణం కోసం  కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి గారికి 2021 లోనే ప్రతిపాదనలు పంపామని 22- 23 బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని సమాధానం ఇచ్చారని ఆయన అన్నారు.

వెంకటగిరి కేంద్రియ విద్యాలయంలో పదవ తరగతి వరకు మాత్రమే చదివేందుకు అవకాశం ఉండేదని తరువాత ఇంటర్ చదివేందుకు ఇబ్బందులు పడుతున్నారని కేంద్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ విద్యా సంవత్సరం నుండి ఇంటర్ విద్య ప్రారంభించారని అన్నారు. తాను ఎంపీ అయిన రెండు సంవత్సరాల కాలం లోనే గౌరవ ముఖ్యమంత్రి సూచనలు సహకారంతో తిరుపతి పార్లమెంట్ అభివృద్ధిపై, సమస్యల దృష్టి సారించానని ఆయన తెలియజేసారు.