Home Page SliderNews AlertTelangana

పెరగనున్న జూపార్కు టికెట్‌ ధరలు..

Share with

హైదరాబాద్‌ నగరంలోని  ప్రసిద్దిగాంచిన  నెహ్రూ జూపార్క్‌ టికెట్‌ ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన జూపార్క్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  నెహ్రూ జూపార్కు సందర్శన టికెట్‌ ధరలు పెంచేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది.  పెద్దలకు సెలవు రోజుల్లో రూ. 80/- ఇతర రోజుల్లో రూ. 70/- , పిల్లలకు సెలవు రోజుల్లో రూ. 55/- ఇతర రోజుల్లో 45/-  రూపాయలు వసూలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూపార్కుల్లో సదుపాయాల్ని పెంచాలని.. సందర్శకులను ఆకట్టుకోవాలని అటవీశాఖ నిర్ణయించింది. 60 వసంతాలు పూర్తి చేసుకున్న హైదరాబాద్‌ జూపార్కును అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.