Home Page SliderInternational

వివేక్ రామస్వామికి బెదిరింపులు

Share with

వివేక్ రామస్వామిని చంపేస్తానంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆయనతో పాటు ప్రచార ఈవెంట్‌కు హాజరయ్యే ప్రతి ఒక్కరిని చంపుతానంటూ సందేశం పంపాడు.

వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న వివేక్ రామస్వామికి బెదిరింపులు వచ్చాయి. ఓటర్ నోటిఫికేషన్‌కు ప్రతిస్పందనగా ఓ వ్యక్తి వివేక్‌ను చంపేస్తానంటూ సందేశం పంపాడు. ఈ మేరకు స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది. అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న వివేక్ ప్రచారంలో భాగంగా రాబోయే ఈవెంట్ల సమాచారం గురించి ఓటర్లకు నోటిఫికేషన్లను పంపించారు. దీనికి వచ్చిన స్పందనల్లో ఓ వ్యక్తి వివేక్‌ను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. రాబోయే ఈవెంట్లు తనకు మంచి అవకాశాన్ని కల్పించబోతున్నాయని.. దీంతో అప్రమత్తమైన పోలీసులు న్యూహాంప్‌షైర్‌లోని డోవర్ నుండి ఈ సందేశాలు వచ్చినట్లు గుర్తించారు. టైలర్ ఆండర్సన్ అనే వ్యక్తి ఈ బెదిరింపు సందేశాలు పంపినట్లు గుర్తించి అరెస్టు చేసినట్లు ఎఫ్‌బీఐ అఫిడవిట్‌లో వెల్లడించింది. నిందితుడిపై నేరం రుజువైతే.. ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 2.50 లక్షల డాలర్ల జరిమానా పడే అవకాశం ఉంది.