Home Page SliderInternational

‘థ్రెడ్స్’ సూపర్ సక్సెస్- కోటి దాటిన యూజర్లు

Share with

మెటా సంస్థ ప్రారంభించిన ‘థ్రెడ్స్’ యాప్ సూపర్ సక్సెస్ అయ్యింది. ట్విటర్‌కు పోటీగా దూసుకుపోతోంది. కేవలం ఏడు గంటలలోనే కోటి మంది యాజర్లను సంపాదించుకుంది. ఫేస్ బుక్ సీఈఓ జుకెన్ బర్గ్ తీసుకొచ్చిన ఈ యాప్‌లో ఇప్పటికే కోటిమందికి పైగా సైన్ ఆఫ్ అయ్యారని జుకెన్ బర్గ్ తెలిపారు. తన థ్రెడ్స్ అకౌంట్‌ను కూడా 5 లక్షల మంది ఫాలో అవుతున్నారని పేర్కొన్నారు. ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ తీసుకుంటున్న పిచ్చి నిర్ణయాలతో విసిగిపోయిన నెటిజన్లు ట్విటర్ నుండి థ్రెడ్స్‌కు షిఫ్ట్ అవుతున్నామంటూ పేర్కొంటున్నారు.