Home Page SliderNational

రాబోయే కాలంలో భారత్‌లో వెయ్యిరెట్లు సంపద పెరుగుదల

Share with

ఎన్‌ఎస్‌డీ నేషనల్ స్టాక్ ఎక్సేంజి ఎండీ అశీష్ కుమార్ రాబోయే 50 ఏళ్లలో భారత్ సంపద వెయ్యిరెట్లు పెరగవచ్చని అభిప్రాయపడ్డారు. భారత్‌లోని యువ జనాభా ద్వారా భారత్ గణనీయమైన వృద్ధిని సాధిస్తుందని పేర్కొన్నారు. సేవల రంగంలో ముందుకు దూసుకుపోతోందని అంచనాలు వేస్తున్నారు. అయితే భారత్ పేదరికం, నిరక్షరాస్యత, ఆహార కొరత, పౌష్టికాహార లోపం, పారిశుద్ధ్యం వంటి రంగాలలో కొన్ని సవాళ్లను ఎదుర్కుంటోందని పేర్కొన్నారు. వాటిని  వీలైనంత తొందరలో అధిగమించడానికి ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని సూచించారు.