Home Page SliderNational

“వారు మళ్లీ నీట్ ఎగ్జామ్ రాయాల్సిందే”:సుప్రీం కోర్టు

Share with

ఈ ఏడాది వెలువడిన నీట్ ఎగ్జామ్‌ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని పలువురు బాధితులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో వారు న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు నీట్ ఎగ్జామ్ ఫలితాలపై కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఈ ఎగ్జామ్‌లో గ్రేస్ మార్కులు పొందిన మొత్తం 1,563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను రద్దు చేస్తున్నట్లు సుప్రీం ప్రకటించింది. అయితే ఈ 1,563 మంది విద్యార్థులు మళ్లీ నీట్ ఎగ్జామ్ రాయాలని తెలిపింది. ఈ మేరకు వారందరికీ జూన్ 23న మరోసారి ఎగ్జామ్ నిర్వహించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. కాగా వారికి జూన్ 30లోపు ఫలితాలను వెల్లడిస్తామని పేర్కొంది. మరోవైపు నీట్ ఎగ్జామ్ కౌన్సిలింగ్ యథావిధిగా కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు కేంద్రానికి వెల్లడించింది. అయితే కౌన్సిలింగ్‌పై ఎటువంటి స్టే విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.దీనిపై మరో రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఎన్టీయేకు నోటీసులు జారీ చేసింది.