National

సూర్యగ్రహణ సమయంలో ఇవి తప్పక ఆచరించండి

Share with

ఈ సంవత్సరంలో వచ్చే చివరి సూర్యగ్రహణం ఈరోజు (అక్టోబరు 25) రాబోతోంది. అయితే హిందువులకు ఈ గ్రహణ సమయాలలో ఎన్నో ఆచారాలు, గ్రహచారాలు ఉంటాయి. చాలామంది వాటిని పాటిస్తారు. అసలు శాస్త్రీయంగా సూర్యగ్రహణం ఎందుకు వస్తుంది ? ఆరోజు చేయవలసిన పనులు ఏంటి ? చేయకూడని పనులు ఏంటి ? వంటి విషయాలను కూలంకుషంగా తెలుసుకుందాం.

సైన్సు దృష్టితో చూస్తే ఈ సూర్యగ్రహణం ఆకాశంలో ఏర్పడే ఒక మూమూలు సంఘటనే. మనం చిన్నప్పుడు సోషల్ పుస్తకాలలో చదువుకునే ఉంటాం. భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడు రావడం వల్ల చంద్రుని నీడ సూర్యుని కప్పడం వల్ల మనకు సూర్యుడు కొన్ని క్షణాల పాటు కనిపించడు. ఇది ఎప్పుడైనా అమావాస్య రోజు మాత్రమే జరుగుతుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖపై వచ్చినప్పుడు జరుగుతుంది.

భారత పురాణాల ప్రకారం రాహువు అనే రాక్షసుడు  అమృత మథనం సమయంలో దేవతల వేషాలలో సూర్య, చంద్రుల మధ్య కూర్చున్నాడని, అతనిని  విష్ణువుకు సూర్యచంద్రులు పట్టించడంతో విష్ణువు అతని తలను నరికేశాడు. దీనితో అప్పటికే అమృతం సేవించిన రాహువు తల, మొండెం వేరైనప్పటికీ అమరత్వం పొందాడు.  రాహు, కేతువులుగా మారి సూర్యచంద్రులపై గ్రహణాల ద్వారా వారిపై పగ తీర్చుకుంటున్నట్లు ప్రతీతి.

ఇక సాంప్రదాయం విషయానికి వస్తే హిందువులు ఆచరించవలసిన కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి.

అవేంటంటే గ్రహణానికి ముందు, తర్వాత తలకు స్నానం చేయాలి. వీటిని పట్టు,విడుపు స్నానాలంటారు. గ్రహణ సమయానికి కనీసం రెండు గంటల ముందు నుండి ఆహారం తీసుకోరాదు. గ్రహణం తర్వాత స్నానం, పూజ  అయిన పిమ్మటే ఆహారం తీసుకోవాలి. గ్రహణ సమయంలో నవగ్రహ స్త్రోత్రాలు, సూర్య ఆరాధన, జపాలు, విష్ణు ఆరాధన చాలా మంచిది. గ్రహణ సమయంలో సూర్యుడుని నేరుగా చూడరాదు. గర్భిణీ స్త్రీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. అసలు బయటకి రాకూడదు. సూర్యరశ్మి తగలకుండా జాగ్రత్త వహించాలి.