Home Page SliderTelangana

మహిళలు ఫ్రీ బస్ ఎక్కాలంటే ఇవి తప్పనిసరి

Share with

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు ఫ్రీ బస్సు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చిన విషయం తెలిసిందే. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మహిళలు తప్పకుండా వీటిని తమ వెంట ఉంచుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం ప్రభుత్వ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు మహిళలు తమ గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ పథకం తెలంగాణా వాసులకు సంబంధించింది. అయితే కొందరు మహిళలు గుర్తింపు కార్డు అంటే కేవలం ఆధార్ కార్డ్ మాత్రమే చూపించాలని అనుకుంటున్నారు. కానీ గుర్తింపు కార్డ్ అంటే ఆధార్ ఒక్కటే కాదు. మహిళలకు రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ,డిసెబిలిటీ కార్డుల్లో ఏదైనా చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టీసీ తెలిపింది.