Andhra PradeshHome Page Slider

 ఏపీలో పదవతరగతి పరీక్షలకు ‘బెంచి’లే కరువు

Share with

ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 3 నుండి పదోతరగతి వార్షిక పరీక్షలు జరగబోతున్నాయి. . అయినా అనేక జిల్లాల్లో ప్రభుత్వపాఠశాలలో పరీక్షలకు అవసరమైన కనీస సౌకర్యాలు కూడా లేవు. కనీసం కూర్చొని రాసేందుకు బెంచీలు కూడా లేవు. ‘నాడు-నేడు’ కార్యక్రమాలు జరుగుతున్న ఉన్నత పాఠశాలల్లో సౌకర్యాల సమస్య ఉందని, ప్రధానోపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఏమాత్రం ప్రయోజనం లేదు. పట్టించుకునే నాధుడే లేడు. ఎవరి స్కూల్ పరిధిలో వారే బెంచీలు సమకూర్చుకోవాలని పరీక్షల అధికారులు చెప్పడంతో ఉపాధ్యాయులకు దిక్కు తోచడం లేదు.

ప్రభుత్వ జిల్లా పరిషత్, పురపాలక, నగర పాలిక, సాంఘిక, ఆదర్శ, గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాలల్లో చాలావరకూ అరకొర సౌకర్యాలతోనే నడుస్తున్నాయి. 70 శాతానికి పైగా ప్రైవేట్ పాఠశాలలనే పరీక్ష కేంద్రాలుగా గుర్తించారు. ఎందుకంటే అక్కడ వసతులు, బెంచీలు, కుర్చీలు ఉంటాయనే ఉద్ధేశ్యంతోనే. ప్రభుత్వ విద్యాశాఖాధికారుల తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.