Home Page SliderTelangana

కోకాపేట HMDA భూములకు అదిరిపోయే డిమాండ్.. కళ్లు తిరిగే ధర

Share with

కోకాపేటలోని HMDAకు చెందిన నియో పోలిస్‌లో భూములకు అదిరిపోయే డిమాండ్ ఏర్పడింది. వేలంలో కళ్లు తిరిగే ధరకు అమ్ముడుపోయాయి. గత మూడు సంవత్సరాలుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం జెట్ స్పీడుతో దూసుకెళ్లుతున్న సంగతి తెలిసిందే. కొద్ది కాలంలోనే ఇక్కడ భూములు, అపార్టమెంటుల ధరలు రెండింతలయ్యాయి. నేడు జరిగిన వేలంలో ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ సంస్థలు పోటీలు పడ్డాయి. ఫేజ్- 2లోని భూములను వేలం వేయగా, ఎకరం భూమి అత్యధిక ధర 72 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యింది. అతి తక్కువగా 51.75 కోట్లు పలికింది. వీటిలో 6,7,8,9 ప్లాట్ల వేలం ద్వారా ప్రభుత్వానికి దాదాపు 1532.50 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. నేడు ఉదయం నిర్వహించిన ఈ వేలంలో 26.86 ఎకరాలకు వేలం పూర్తయ్యింది. సాయంత్రం 6 గంటల వరకూ 18.47 ఎకరాలకు వేలం నిర్వహించనున్నారు. వీటికి కూడా భారీ ధరలు రావచ్చని అంచనాలు వేస్తున్నారు.