Home Page SliderTelangana

సైబర్ మోసగాళ్ల వల..ప్రజలు విలవిల

Share with

తెలంగాణా రాజధాని హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రతిరోజు సైబర్ మోసాల కేసులు నమోదవుతూనే ఉన్నాయి. పోలీసులు ప్రజలకు వీటిల్లో చిక్కుకోకుండా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సైబర్ మోసగాళ్ల వలలో పడొద్దని,వాళ్ళు  పంపించే ఎటువంటి లింక్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో తెరవద్దని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ఎంతోమంది అత్యాశకు పోయి పోలీసుల మాటల్ని పెడచెవిన పెడుతున్నారు. దీంతో చాలా సులువుగా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. కాగా లక్షలకొద్దీ రూపాయలను పోగొట్టుకుంటున్నారు. ఈ విధంగా ఈ ఏడాది తొలి 2 నెలల్లో హైదరాబాద్ ,ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలలోని మూడు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 200 కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. కాగా ఈ సైబర్ దాడుల్లో బాధితులు రూ.8 కోట్ల వరకు డబ్బులు పోగొట్టుకున్నారు. దీంతో పోలీసులు ప్రజలు తమ మొబైల్ ఫోన్‌లకు వచ్చే ఎటువంటి లింకులను క్లిక్ చేయొద్దని,వారు ఇచ్చే ఆఫర్స్‌ను నమ్మొద్దన్నారు. ఈ సైబర్ నేరగాళ్ల విషయంలో ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అంతేకాకుండా చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నంత మాత్రాన ఏమి చేయలేమని తెలిపారు.