Andhra PradeshHome Page Slider

గిరినాగును భయంతో చంపి, భక్తితో గుడి కట్టిన గ్రామస్తులు

Share with

మన హిందూ సంప్రదాయంలో నాగులను దేవతగా కొలుస్తారు. 13 అడుగుల ఆ గిరినాగును చూసి, ఆ గ్రామస్తుల పై ప్రాణాలు పైనే పోయాయి. పరుగున ఇళ్లలో దూకి తలుపులు వేసుకున్నారు. విజయనగరం జిల్లా వేపాడ మండలం, జాకీరు అనే గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఈ గిరినాగులు తోకపై లేచి, మనిషి తలపై కాటు వేస్తాయట. ఈ భయంతో ఆ గ్రామస్తులు భయంతో ఆ పామును చంపేశారు. నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది. కానీ కొంతమంది పెద్దలు, పండితులు ఈ గిరినాగు ఊరిలో తిరిగితే సుభిక్షం అని, దానిని చంపడం పాపమని, పాప పరిహారం చేయాలని పేర్కొన్నారు. దీనితో గ్రామస్తులు దీనికి శాంతి చేయాలని భావించి, ఈ రోజు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించారు. దీనికి గుడి కట్టాలని డిసైడ్ అయ్యారు.

ఈ గిరినాగు చాలా అరుదైన జాతి అని, ఇది విషకీటకాలను, ఎలుకలను తిని పంటలను కాపాడుతుందని దీనిని చంపొద్దని, కనిపిస్తే తమకు తెలియజేయమని స్నేక్ క్నాచర్స్ చెప్తున్నారు. ఇది 18 అడుగులు పొడవు, 10 కేజీల బరువు ఉంటుందట. ఈ పాము విషం చాలా విషపూరితమని, కాటువేస్తే బతికే అవకాశాలు కేవలం పాతిక శాతం మాత్రమేనంటున్నారు శాస్త్రవేత్తలు. ఇవి వేసవిలో నీటి కోసం పొలాల బాట పడుతున్నాయి. ఇవి దట్టమైన అడవులలో ఉంటాయి. అడవులు తగ్గిపోతుండడంతో ఇవి పల్లెబాట పడుతున్నాయని, ప్రకృతిని పరిరక్షించమని, వన్యప్రాణులను బ్రతికిస్తేనే మనుషుల మనుగడ కూడా ఉంటుందని అంటున్నారు పర్యావరణవేత్తలు.