Home Page SliderNational

రామ్-బోయపాటి సినిమా టైటిల్ ఖరారు

Share with

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో చాక్లెట్ బాయ్ రామ్ హీరోగా రూపొందుతున్న సినిమాకి టైటిల్ తాజాగా ఖరారైంది. కాగా ఈ సినిమాకి స్కంద(ది అటాకర్)అనే సినిమా టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు.  ఈ మేరకు ఈ సినిమా నుంచి గ్లింప్స్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “మీరు దిగితే ఊడేదుండదు..నేను దిగితే మిగిలేదుండదు” అని హీరో రామ్ చెప్పే డైలాగ్ ఈ సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచుతోంది. ఈ సినిమాలో రామ్‌కు జోడిగా ఎంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్‌ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.