Andhra PradeshHome Page Slider

రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది : చంద్రబాబు నాయుడు

Share with

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని జగన్ సీఎంగా వచ్చిన తర్వాత అందరి జీవితాలు అతలాకుతలం అయిపోయాయని పది రూపాయలు ఇచ్చి వంద దోచేస్తున్నాడంటూ మాజీ సీఎం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో మంగళవారం ఆయన ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా రోడ్ షో నిర్వహించిన అనంతరం అమరావతిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. జగన్ ఇంటి మీద మీ బొమ్మ వేస్తే ఒప్పుకుంటాడా, పోలీసుల ఇంటి మీద మీ బొమ్మ వేస్తే ఒప్పుకుంటారా, మన ఇంటి మీద వీళ్ళ బొమ్మలు ఏంటి ఆ స్టిక్కర్లు తీసేయండని చెప్పారు. ఇంటికి వాళ్లు బొమ్మ అంటిస్తే మనం వాళ్ళ మొహంపై బొమ్మ వేస్తామని చెప్పండి అంటూ ప్రజలకు చంద్రబాబు సూచించారు.

పట్టాదారు పుస్తకాలపై సర్వే రాళ్లపైన జగన్ బొమ్మ ఏంటి ఆ సైకో బొమ్మ మనకెందుకు ఆ బొమ్మ చూస్తే మనకు బాబాయి కేసు గుర్తుకు వస్తుందంటూ ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వస్తేనే ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని పేదరికం లేని సమాజం నిర్మించాలనేది తన జీవిత ఆశయమని నిరుపేదలకు తెలుగుదేశం పార్టీ జెండా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సంపద సృష్టితోపాటు ఆ సంపదను పేదలకు చేర్చడం కూడా ముఖ్యమన్నారు. నాలుగేళ్ల లో సీఎం ఒక్క పని చేశాడా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో తాను చేసిన అభివృద్ధిని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించాయని అందుకే హైదరాబాద్ ఇప్పుడు అంత అభివృద్ధి చెందిందని చంద్రబాబు చెప్పారు.