InternationalNewsNews Alert

కరోనా జన్మరహస్యం వీడింది

Share with

2019 డిసెంబర్ కొవిడ్-19  మానవజాతిని ఉలిక్కిపడేలా చేసింది. ఎన్నో వేల సంవత్సరాలుగా బుద్దిజీవిగా విర్రవీగుతున్న మనిషి పొగరు దిగిపోయేలా చేసింది. కంటికి కూడా కనబడని ఒక జీవిగా కూడా లెక్కలోకి రాని, చిన్న వైరస్ ఎన్నో లక్షల ప్రాణాలు బలితీసుకుంది. సైన్స్ పుణ్యమా అని దీనికి తొందరలోనే వాక్సిన్ కనిపెట్టగలిగాము.  అయితే ఇంకా దీనిమీద ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది చైనాలోని వూహాన్ సీఫుడ్ హోల్‌సేల్ మార్కెట్‌లోనే పుట్టిందని సైన్స్ పత్రికలో ప్రచురితమైన స్క్రిప్స్ రీసెర్చ్ కేంద్రంలో ఇమ్యునాలజీ, మైక్రోబయాలజీ విభాగం ప్రొఫెసర్ క్రిస్టియన్ అండర్సన్ తెలిపారు. ఇంకొక పరిశోధనలో 2019 డిసెంబరులో మొదటి 150 కొవిడ్ కేసులు ఎక్కడెక్కడ నుండి వచ్చాయో యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాకు చెందిన ఎవల్యూషనరీ బయాలజిస్టు మైఖేల్ వోరోబే, ఆయన సహచరులు గుర్తించారు. 2020 మొదటి రెండు నెలల్లో గుర్తించిన కేసుల వివరాలను సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్నారు. ఈ కేసులన్నీ మార్కెట్‌కు అత్యంత దగ్గరగా ఉన్నాయని పేర్కొన్నారు.

దాన్నిబట్టి మార్కెట్‌లో పనిచేసేవారిలో ముందుగా ఈ వైరస్ మొదలై, తర్వాత స్థానికంగా వ్యాపించిందని తెలుసుకున్నారు. మరొక పరిశోధనలో కొవిడ్ వైరస్‌లో 2 లైనేజ్‌లు ఉన్నాయని, ఎ అనేది గబ్బిలాలకు సంబంధించినది కాగా బి మాత్రం మార్కెట్లోని మనుషులనుండే సంక్రమించినట్లు గుర్తించారు. దీన్నిబట్టి ఈ వైరస్ ముందుగా జంతువుల నుండి మనుషులకు, తర్వాత మనుషులనుండి మనుషులకు ఇది వ్యాపించిందని తెలియవచ్చింది. అలాగని పూర్తిగా ల్యాబ్ నుండి లీక్ కాలేదని కూడా చెప్పలేము. ఈవిషయాలన్నీ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోని వైరల్ ఎవల్యూషన్ నిపుణుడు జోయెల్ బృందం పరిశోధనల ద్వారా తెలియజేసింది.