Andhra PradeshHome Page Slider

స్మశాన వాటికల సమస్య పరిష్కరించాలి

Share with

అమరావతి: క్రైస్తవుల స్మశాన వాటికల సమస్య పరిష్కరించాలి. చర్చిల ఆస్తుల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని మేం చేస్తున్న న్యాయ పోరాటానికి తోడుగా నిలవండి అని క్రైస్తవ ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్‌ను కోరారు. వీరితో ముఖ్యమంత్రి తన క్యాంప్ ఆఫీస్‌లో శుక్రవారం సమావేశమయ్యారు. ఆ వివరాలను సీఎం ఆఫీస్ ఓ ప్రకటనలో తెలిపింది. జిల్లా కేంద్రాల్లో కమ్యూనిటీ హాళ్లు నిర్మించాలి. చర్చిల ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలు, సేవాభవనాలకు మున్సిపల్ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలి అని ప్రతినిధులు కోరారు. పాస్టర్లకు గౌరవ వేతనం ఇచ్చి.. సహాయంగా నిలిచినందుకు ధన్యవాదాలు, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి అని పేర్కొన్నారు. సీఎం స్పందిస్తూ.. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం.. మరోవైపు ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉందనేది మీకూ తెలుసు. స్మశాన వాటికలపై నివేదికలు తెప్పించుకున్నాం, సచివాలయాల వారీగా అవి లేనిచోట్ల ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు జారీచేశాం అని వివరించారు.