Home Page SliderInternational

మోదీపై ప్రశంసలజల్లు కురిపించిన ఇటలీ ప్రధాని

Share with

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా భారత ప్రధాని మోదీ ఖ్యాతి గడించారని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రశంసలు కురిపించారు. భారత్‌లో ఏటా నిర్వహించే బహుపాక్షిక సదస్సు రైసినా డైలాగ్ ఎనిమిదో సదస్సుకు హాజయ్యేందుకు ఆమె న్యూ ఢిల్లీకి ఈ రోజు (గురువారం) చేరుకున్నారు. ప్రధాని మోదీ ఆమెకు రాష్ట్రపతి భవన్ వద్ద స్వాగతం పలికారు. గడచిన ఐదేళ్లలో యూరోపియన్ దేశాలలో అగ్రనాయకురాలిగా పేరు పొందింది. అటువంటి జార్జియా మోదీని ప్రశంసించడం విశేషంగా మారింది. రైసినా డైలాగ్ ప్రారంభ సెషన్‌లో ఇటాలియన్ ప్రధాని జార్జియా ముఖ్య అతిథి, ముఖ్య వక్తగా పాల్గొంటారు. విదేశీ మంత్రిత్వ శాఖ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ మార్చి 2 నుండి 4 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీనిలో 100 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. ఆమె పర్యటన వల్ల భారత్, ఇటలీ మధ్య మంచి సంబంధాలు పటిష్టమౌతాయని విదేశాంగ శాఖ పేర్కొంది.