Home Page SliderTelangana

23న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం?

Share with

హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌ను ఈ నెల 23న శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్‌ను ఈ నెల 22న ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్‌పై ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ప్రభుత్వ శాఖల ప్రతిపాదనలపై మంత్రి భట్టి విక్రమార్క సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆయా శాఖల అధికారులతో ఆయన భేటీ అయ్యి తగు ప్రతిపాదనలు తీసుకున్నారు.