InternationalNews

“నాటు నాటు పాట”కు స్టెప్పులేసిన పాకిస్థానీ బ్యూటీ

Share with

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం RRR మేనియా నడుస్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా ప్రపంచానికి తెలుగోడి సత్తా ఎంటో నిరూపించింది. కాగా ప్రపంచంలో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన అవార్డులను కూడా ఈ సినిమా కైవసం చేసుకుంది. ఒక విధంగా చెప్పాలంటే యావత్తు ప్రపంచమే ఈ సినిమాకి సలామ్ కొట్టిందనే చెప్పాలి. అయితే ముఖ్యంగా ఈ సినిమాలోని “నాటు నాటు” పాటకు వచ్చిన క్రేజ్ అంత ఇంత కాదనే చెప్పాలి. ఈ పాట రిలీజ్ అయినప్పటి నుంచి ప్రపంచాన్ని ఉర్రూతలుగిస్తూనే ఉంది. కాగా వయసుతో తేడా లేకుండా చిన్నపెద్దా ,సెలబ్రిటీలు అందరూ ఈ పాటకు స్టెప్పులేశారు.

 మన దాయాది దేశామయిన పాకిస్థాన్‌ను కూడా ఈ పాట ఫిదా చేసింది. పాకిస్థాని బ్యూటీ హనియా అమిర్ కూడా ఈ పాటకు స్టెప్పులేశారు. తాజాగా ఆమె ఓ పెళ్లి వేడుకలో నాటు నాటు పాటకు స్టెప్పులేస్తూ..అదరగొట్టారు.  వేడుకకు వచ్చిన బంధువులంతా చూస్తుండగా నాటు నాటు పాటలోని హుక్ స్టెప్పులు వేసి అలరించారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా సూపర్ అంటూ ఆమెపై  కామెంట్ల రూపంలో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.