Home Page SliderInternational

నిప్పంటించుకొని పరుగెత్తి..రెండు ప్రపంచ రికార్డులు కొల్లగొట్టిన వ్యక్తి

Share with

ఓ ఫైర్ ఫైటర్ పెద్ద సాహసం చేశాడు. అదేంటంటే నిప్పంటించుకొని ఏకంగా 272.25 మీటర్లు పరుగెత్తాడు. దీంతో ఆయన రెండు గిన్నిస్ రికార్డులు సృష్టించాడు. కాగా ఈ ఫైర్ ఫైటర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్రాన్స్ దేశానికి చెందిన 39 ఏళ్ల జోనాథన్ ఓ ఫైర్ ఫైటర్‌. అయితే ఈయన తాజాగా శరీరానికి నిప్పంటించుకొని ఏకంగా 272.25మీటర్లు పరిగెత్తి గిన్నిస్ రికార్డు సృష్టించారు. దీంతో గతంలో ఉన్న 204.23మీటర్లుగా ఉన్న రికార్డులను బద్దలు కొట్టాడు. అయితే ఆయన ఇక్కడ కేవలం ఓ రక్షణ సూట్ మాత్రమే ధరించి,ఆక్సిజన్ లేకుండా పరిగెత్తడం విశేషం. ఈ క్రమంలోనే ఆయన మరో గిన్నిస్ రికార్డును నెలకొల్పాడు. ఒంటికి నిప్పంటించుకొని అత్యంత వేగంగా 100 మీటర్ల స్ర్పింగ్ పూర్తి చేసిన వ్యక్తిగా గిన్నిస్‌లో చోటు దక్కించుకున్నాడు.కాగా ఇతను కేవలం 17 సెకన్లలోనే 100మీటర్ల పరుగు పూర్తి చేశాడు. ఈ విధంగా గతంలో బ్రిటన్‌కు చెందిన ఆంటోనీ బ్రిట్టన్(24.58 సెకెన్ల) పేరిట ఉన్న రికార్డును తిరిగి రాశాడు.అయితే దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది.