Home Page SliderNationalSports

ముంబై జట్టులో చాలా లోపాలున్నాయన్న మాజీ కోచ్

Share with

ప్రస్తుతం భారత దేశమంతా IPL మేనియా నడుస్తోంది. అయితే ఈ సీజన్‌లో కొన్ని జట్టుల ప్రదర్శన అంతంత మాత్రంగా ఉంది. కాగా మరికొన్ని జట్లలలో ఆటగాళ్లు ఫామ్‌లో లేనట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ IPL కోచ్ ఈ సీజన్‌లో IPL జట్టుల ఆట తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోచ్ టామ్ మూడీ SRH మాజీ కోచ్.కాగా ఈయన ముంబై ఇండియన్స్ జట్టులో చాలా లోపాలున్నాయని అభిప్రాయపడ్డారు.  అంతేకాకుండా ఆ టీమ్‌లో సమతుల్యత లోపించిందన్నారు. ఆటలో అన్నీ స్థానాల్లో మెరుగ్గా బౌలింగ్ చేసే దేశీయ,విదేశీ ఆటగాళ్లు కరువయ్యరన్నారు.  విదేశీ ఆటగాళ్ల విషయంలోనూ ఆ జట్టులో సమతుల్యత లోపించిందని తెలిపారు. ముంబై ఇండియన్స్ టీమ్ తమ లోపాలను సరిచేసుకోకుంటే ఈసారి ఫైనల్ చేరడం చాలా కష్టమని టామ్ మూడీ హెచ్చరించారు.