Home Page SliderTelangana

మిర్చి బజ్జీల కోసం.. అంబులెన్స్ సైరన్ ఆన్ చేసి వెళ్లిన డ్రైవర్

Share with

ఓ అంబులెన్స్ డ్రైవర్ అత్యవసర సమయాల్లో ఉపయోగించే సైరన్‌ను దుర్వినియోగం చేశాడు. రోగుల ప్రాణాలను కాపాడటానికి ఉపయోగించే సైరన్‌ను మిర్చి బజ్జీల కోసం మోగించి ట్రాఫిక్ పోలీసుకు చిక్కాడు. అయితే ఈ ఘటన హైదరాబాద్‌ నారాయణగూడలో జరిగింది. అంబులెన్స్ డ్రైవర్ సైరన్ మోగించడంతో ట్రాఫిక్ పోలీసు సిగ్నల్ క్లియర్ చేశాడు. దీంతో ఆ అంబులెన్స్ డ్రైవర్ సిగ్నల్ దాటాడు. అయితే సిగ్నల్ దాటిన అంబులెన్స్ డ్రైవర్ ఏం చేశాడో తెలిస్తే అందరు షాక్ అవుతారు. ఎందుకంటే సిగ్నల్ దాటి వెళ్లిన డ్రైవర్ ముందుకెళ్లి బజ్జీలు,కూల్‌డ్రింక్‌లు కొన్నాడు. ఇది గమనించిన పోలీస్ అంబులెన్స్ దగ్గరికి వెళ్లి డ్రైవర్‌ను ప్రశ్నించాడు. అంబులెన్స్‌లో రోగి లేనప్పుడు సైరన్ ఎందుకు మోగించావని డ్రైవర్‌ను నిలదీశాడు. అంబులెన్స్ కోసం తాను సిగ్నల్ క్లియర్ చేశానని పోలీస్ తెలిపారు. సైరన్‌ను దుర్వినియోగం చేసినందుకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ట్రాఫిక్  పోలీస్ అంబులెన్స్ డ్రైవర్‌ను హెచ్చరించారు. అయితే దీనిపై స్పందించిన డీజీపీ అంజనీ కుమార్ ఈ వీడియోను షేర్ చేస్తూ..అత్యవసర సైరన్‌ను దుర్వినియోగం చెయొద్దని అంబులెన్స్ డ్రైవర్‌కు సూచించారు. లేదంటే చట్టప్రకారం చర్యలు తప్పవని డ్రైవర్‌ను హెచ్చరించారు.