Home Page SliderTelangana

గోషామహల్, కరీంనగర్, కోరుట్లలో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థుల్నే నిలబెట్టింది

Share with

హైదరాబాద్: ఐటీ దాడులు కేవలం కాంగ్రెస్ నేతలపైనే జరుగుతున్నాయనడం అవాస్తమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ పార్టీ నేతలు ఇప్పటికే అస్త్రసన్యాసం చేశారని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణకు స్వీయపాలనే శ్రీరామరక్ష అని చెప్పారు. ఈ నెల 29న దీక్షా దివస్.. కేసీఆర్ దీక్షతో కేంద్రం దిగివచ్చి తెలంగాణపై ప్రకటన చేసిందని.. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ 29న దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహిస్తామని కేటీఆర్ చెప్పారు. ఆ రోజు బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడివారు అక్కడే దీక్షా దివస్‌ను నిర్వహించాలని ఆయన పిలునిచ్చారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లను పంపిణీ, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. రాహుల్ గాంధీ.. కర్ణాటకలో ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చారా? గోషామహల్, కరీంనగర్, కోరుట్లలో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టింది. గోషామహల్‌లో బీజేపీ అభ్యర్థిని ఓడిస్తాం. రైతు బంధు కొత్త పథకం కాదు.. కొన్నేళ్లుగా అది కొనసాగుతోంది. రాహుల్ గాంధీకి ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు. కానీ, ఉద్యోగమంటే ఏమిటో తెలుసా. అసలు అప్లికేషన్ ఎప్పుడూ ఫిలప్ చేయలేదు.