Andhra PradeshHome Page Slider

భర్తను రూ.5 లక్షలకు అమ్మేసిన ‘శుభలగ్నం ’ సినిమా కాన్సెప్ట్‌

Share with

ఇది ఆధునిక మహాభారతం. తన భర్తను రూ.5 లక్షలకు మరో మహిళకు విక్రయించిన భార్య కథ.

మండ్య : ఇది ఆధునిక మహాభారతం. తన భర్తను రూ.5 లక్షలకు మరో మహిళకు అమ్మేసిన  భార్య కథ. ఒక తెలుగు (శుభలగ్నం) సినిమాలో కథానాయిక తన భర్తను ప్రేమించిన మహిళకు రూ.కోటికి విక్రయిస్తుంది. సరిగ్గా అదే తరహా ఘటన కర్ణాటకలోని మండ్య సమీప గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే ఒక మహిళతో తన భర్త సన్నిహితంగా ఉన్నాడని ఆ గృహిణి గుర్తించింది. వారిద్దరూ పడకపై ఉన్నప్పుడు నేరుగా చూసింది, నిలదీసింది. ఆడవాళ్ల ఇద్దరి మధ్య జరిగిన గొడవ పంచాయితీకి చేరింది. నీ భర్తనా దగ్గర రూ.5 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఆ మొత్తం చెల్లించేస్తే ఓకే.. తీసుకెళ్లు అని ఆ మహిళ గట్టిగా చెప్పింది. అలాంటి భర్త నాకేమీ వద్దని, నాకే రూ.5 లక్షల మనోవర్తి ఇచ్చి, అతన్ని నువ్వే ఉంచుకో అని ఆ ఇల్లాలు చెప్పింది. ఆ నగదు ఇచ్చేందుకు ఒక నెల సమయం ఇస్తే ఆ డబ్బు ఇస్తానని ఆ మహిళ చెప్పింది. అందుకు ఆ గృహిణి అంగీకరించింది. వీరిద్దరూ చేసుకున్న రాజీ ఒప్పందం చూసి  పంచాయతీ ప్రతినిధులు, నోటిమీద వేలు వేసుకున్నారు.