Home Page SliderNational

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. పోస్టల్ బ్యాలెట్ ఓటు సదుపాయం  ఎవరికంటే..!

Share with

దేశంలోని 5(తెలంగాణా,మిజోరాం,మధ్యప్రదేశ్,రాజస్థాన్,ఛత్తీస్ ఘడ్) రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే దేశంలోని జర్నలిస్టులతోపాటు ఎన్నికలతో సంబంధం లేని 12 అత్యవసర సేవల రంగానికి చెందిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటును వినియోగించుకునే అవకాశం కల్పించింది. కాగా దీనిపై ఈ నెల 10న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎన్నికల వార్తల సేకరణ విధుల్లో ఉన్న జర్నలిస్టులు మాత్రమే ఈ సేవలను వినియోగించుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. కాగా ఈ పోస్టల్ బ్యాలెట్‌ను ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా,ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా,భారత రైల్వే,ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో,దూరదర్శన్,ఆల్ ఇండియా రేడియో,విద్యుత్ శాఖ,వైద్య ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ,RTC,పౌర సరఫరాల శాఖ,BSNLతోపాటు పోలింగ్ రోజు వార్తల సేకరణ కోసం కేదంర ఎన్నికల సంఘం నుంచి పాస్ పొందిన జర్నలిస్ట్‌లు,అగ్నిమాపక శాఖ అధికారులు  వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.