Home Page SliderNational

దేశంలో 14 యాప్‌లపై నిషేదం విధించిన కేంద్రం

Share with

భారతదేశంలో ఇప్పటికే పలు రకాల విదేశీ,స్వదేశీ యాప్‌లను కేంద్రం నిషేదించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో 14 యాప్‌లను కేంద్రం నిషేదించింది. కాగా దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు ఈ 14 యూప్‌లు వేదికగా మారినట్లు కేంద్రం గుర్తించింది. పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు ..కశ్మీర్‌లో తమకు పనిచేస్తున్న ముష్కరులకు ఈ యాప్స్ ద్వారా సమాచారం అందిస్తున్నారని తెలుస్తోంది. వీటిలో క్రిప్‌వైజర్,ఎనిగ్మా,సేఫ్‌స్విస్,మీడియా ఫైర్,IMO,Bchat,బ్రైయర్,సెకండ్ లైన్ మొదలైన యాప్స్ ఉన్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం 2020 నుంచి ఇప్పటివరకు దేశంలో దాదాపు 250 యాప్‌లను బ్యాన్ చేసింది. అయితే వీటిలో కొన్ని యాప్స్ వ్యక్తిగత భద్రతకు భంగం కలిగిస్తున్నాయని బ్యాన్ చేయగా..మరికొన్ని దేశ భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని కేంద్రం వీటిని నిషేదించింది.