InternationalNews

ఖర్చు తగ్గించుకునే పనిలో బంగ్లాదేశ్

Share with

బంగ్లాదేశ్, ఢాకా, మనసర్కార్

విదేశీ మారక నిల్వలను కాపాడుకునే యత్నం
నోరా ఫతేహి షోకు బంగ్లాదేశ్ అనుమతి నిరాకరణ

బంగ్లాదేశ్ ప్రభుత్వం పొదుపు చర్యల్లో భాగంగా బాలీవుడ్ నటి నోరా ఫతేహీకి రాజధాని ఢాకాలో ఒక కార్యక్రమంలో ప్రదర్శనకు అనుమతి నిరాకరించింది. ఇందుకు సంబంధించి బంగ్లాదేశ్ సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం నోటీసు జారీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తాజా పరిస్థితులతో విదేశీ మారక నిల్వలను కాపాడుకోవాలని ఫతేహికి అనుమతి ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. మహిళా లీడర్‌షిప్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫతేహి డాన్స్ షోను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. రోజు రోజుకు క్షీణిస్తున్న విదేశీ మారక నిల్వలు తగ్గుతుండటంతో డాలర్ చెల్లింపులపై సెంట్రల్ బ్యాంక్ ఆంక్షలను ప్రతిపాదించింది. ఇది అక్టోబర్ 12 నాటికి 36.33 బిలియన్లకు పడిపోయింది. సుమారు నాలుగు నెలల దిగుమతులను కవర్ చేయడానికి ఇది సరిపోతుందని చెప్పారు. గత ఏడాది క్రితం $46.13 బిలియన్లు ఉన్నాయి. మొరాకో-కెనడియన్ కుటుంబం నుండి వచ్చిన ఫతేహి 2014లో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. డబ్బులకు ఇబ్బందులు లేకున్నప్పటికీ… జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రభుత్వవర్గాలు చెప్పాయి.