Home Page SliderNational

“ఇల్లు ఖాళీ చేయాలని నాకు లేఖ రాసినందుకు కృతజ్ఞతలు”

Share with

పరువు నష్టం కేసులో శిక్షపడి అధికారాన్ని పోగొట్టుకున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ మేరకు ఆయన ఇప్పటి వరకు నివాసం చేసిన అధికార భవనాన్ని ఖాళీ చేయాలని లోక్‌సభ సెక్రటేరియట్ నుంచి ఆయనకు నోటీసులు వచ్చాయి. దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ త్వరలోనే ఆ ఇంటిని ఖాళీ చేస్తానని వెల్లడించారు. కాగా తాను ఢిల్లీ తుగ్లక్ లేన్‌లోన 12వ నంబరు బంగళాను ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికయ్యాను. అది ప్రజల తీర్పు.దానివల్లే ఇంతకాలం ఈ ఇంట్లో ఉన్నానన్నారు. నాకు ఈ ఇంటితో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని, ఈ ఇంటిలో గడిపిన తీపిజ్ఞాపకాలను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. నా హక్కులకు భంగం కలగకుండా లోక్‌సభ సెక్రటేరియట్ లేఖలో రాసిన ఆదేశాలకు కట్టుబడి ఉంటానని రాహుల్ లోక్‌సభ అధికారులకు లేఖ రాసినట్లు పేర్కొన్నారు.