Home Page SliderTelangana

తెలంగాణ ఈఏపీసెట్ కౌన్సిలింగ్ తేదీలు మార్పు

Share with

జూన్ 27నుండి మొదలుకావలసిన ఈఏపీసెట్ కౌన్సిలింగ్ తేదీలు మార్పు చెందాయి. వాటిని జూలై 4 నుండి మొదలయ్యేలా మార్పు చేశారు. ఈ విషయాన్ని తెలంగాణ ఎంసెట్ వెబ్‌సైట్లలో కొత్తగా మార్పు చేశారు. దీనికి గల కారణాలు ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలలో సీట్లు పెంచడానికే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏఐసీటీఈ ఆదేశాల ప్రకారం దాదాపు 50 కళాశాలలు కంప్యూటర్ సైన్స్ కోర్సు ఉన్న సీట్లను పెంచుకోవడానికి దరఖాస్తులు చేశాయి. అయితే దీనిని రాష్ట్రప్రభుత్వం ఇంకా అంగీకారం తెలుపలేదు. విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉండడంతో ఆయన నిర్ణయం ఇంకా తీసుకోలేదని తెలుస్తోంది. కొత్తసీట్లకు అనుమతి లభిస్తే కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. కొన్ని నిబంధనలు అనుసరించి కళాశాలలు ఆఫ్ క్యాంపస్‌లు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. హైదరాబాదులో మరో క్యాంపస్ ఏర్పాటుకు 4 కళాశాలలు అనుమతులు కోరుతున్నాయి. వాటికి ఇంకా రాష్ట్రప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈ సంవత్సరం ఈ అనుమతులు లభించవని తెలుస్తోంది. అయితే వీటివల్ల ఆగస్టు నెలాఖరు వరకూ అడ్మిషన్లు కొనసాగే అవకాశం ఉంది.