Home Page SliderTelangana

అర్ధరాత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్టు

Share with

బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను తెలంగాణ పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేశారు. కారణం చెప్పకుండానే అరెస్టు చేయడంతో.. ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు. వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారని పోలీసులను ప్రశ్నించారు. అయితే సీఎం కేసీఆర్… తన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సర్టిఫికేట్‌లను చూపించాలని సీఎం కేసీఆర్‌ను, డిమాండ్ చేసిన ఒక రోజు తర్వాత… అర్థరాత్రి తనను పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. అధికార పార్టీని ప్రశ్నించినందుకు తనను అరెస్టు చేయడం ద్వారా రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటోందని మండిపడ్డారు. అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసుల గొడవ దృశ్యాలను సంజయ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. “BRS లో భయం నిజమే! ముందుగా నన్ను ప్రెస్ మీట్ నిర్వహించకుండా ఆపి, ఇప్పుడు అర్థరాత్రి అరెస్ట్ చేశారు. BRS ప్రభుత్వాన్ని దాని తప్పుడు పనులపై ప్రశ్నించడమే నా తప్పు. నన్ను జైల్లో పెట్టినా బీఆర్‌ఎస్‌ని ప్రశ్నించడం ఆపొద్దు. జై శ్రీ రామ్! భారత్ మాతా కీ జై! జై తెలంగాణ!” అంటూ రాసుకొచ్చారు.

పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌లో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ నల్గొండ జిల్లాలోని బొమ్మల రామారం పోలీస్ స్టేషన్‌కు బండి సంజయ్‌ను పోలీసులు తీసుకెళ్లారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC), పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీకి కేసీఆర్ ప్రభుత్వాన్ని బాధ్యులను చేస్తూ, సంజయ్ గతంలో కేసీఆర్, తనయుడు కేటీఆర్ మంత్రివర్గం నుండి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును ఖండించారు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి. కారణం చెప్పకుండా అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది విమర్శించారు.

పదవ తరగతి పరీక్షలు కూడా నిర్వహించలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకురావడం సిగ్గుచేటన్నారు బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్. విద్యార్థులకు భరోసా కల్పించాల్సిన భాద్యత ఈ ప్రభుత్వం మీద ఉందన్నారు. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును జెండా ఊపేందుకు.. ప్రధాని మోదీ… శనివారం తెలంగాణకు వస్తున్న సమయంలో సంజయ్ అరెస్టు అక్రమమన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్‌పై కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని నిలదీసినందునే ఇలా చేశారని ఆయన ఆక్షేపించారు. సంజయ్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.

సంజయ్ అరెస్టును బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా తప్పుబట్టారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. “అర్ధరాత్రి ఆపరేషన్‌లో, సెకండరీ స్కూల్ పేపర్ లీక్‌లో ప్రమేయం ఉందనే కల్పిత ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారని… ఇది కేసీఆర్‌కు ఎంత మాత్రం మంచిదికాదన్నారు.