Andhra PradeshHome Page Slider

టిడిపి ది డస్ట్ బిన్ మేనిఫెస్టో: జోగి రమేష్

Share with

టీడీపీ మహనాడు కార్యక్రమం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా నిన్న జరిగిన మహనాడులో టీడీపీ అధినేత చండ్రబాబు ఆ పార్టీ మినీ మ్యానిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యానిఫెస్టోపై అధికార పక్షం నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై ఇప్పటికే పలువురు వైసీపీ నాయకులు స్పందించి చంద్రబాబును దుయ్యబట్టారు. అయితే తాజాగా దీనిపై ఏపీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. ఇవాళ తాడేపల్లిలో నిర్వహించిన మీడీయా సమావేశంలో పాల్గొన్న వైపీపీ మంత్రి జోగిరమేష్ చంద్రబాబుని తీవ్రస్థాయిలో విమర్శించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014లో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 650 వాగ్దానాలు చేసి గాలికి వదిలేశారన్నారు. చంద్రబాబు చేసిన 650 వాగ్దానాల్లో 10 హామీలనైనా నెరవేర్చలేదని “టీడీపీది డస్ట్ బిన్ మేనిఫెస్టో” అని ఆయన దుయ్యబట్టారు. అంతేకాకుండా మేనిఫెస్టోను మాయం చేసిన ఘనుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. చంద్రబాబు చరిత్రే నకిలీ చరిత్ర అని, బాబు ఓ డర్టీ ఫెలో, దొంగ అని విమర్శించారు. 14 ఏళ్లు అధికారంలో ఉండి చంద్రబాబు చేయలేని అభివృద్ధిని కేవలం నాలుగేళ్లలోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసి చూపించారన్నారు. ఆల్ కాపీ బాబు, నకిలీ బాబుకు 2024లోనూ పరాభవం తప్పదని వైసిపి మంత్రి జోస్యంచెప్పారు. పొత్తుల్లేకుండా ఎన్నికలకు వెళ్లలేని పిరికిపంద చంద్రబాబు అని, 14 ఏళ్లుగా సీఎంగా ఉన్నప్పుడు నిరుద్యోగ భృతి ఏమైందని? జోగి రమేష్ చంద్రబాబును ప్రశ్నించారు.