Andhra PradeshHome Page Slider

ఏపీలో మాదిగలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ టీడీపీ

Share with

మాదిగలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్దికంగా ఎదిగేందుకు టీడీపీ కృషి చేస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో మాదిగల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంకు ముఖ్య అతిధిగా పాల్గొన్న అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 42 ఏళ్ల నుండి మాదిగలు టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్నారని అన్నారు. దామాషా ప్రకారం అన్ని అవకాశాలు కల్పిస్తామని అచ్చెనాయుడు హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఏపీలో మాదిగలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ టీడీపీనే అని అచ్చెనాయుడు స్పష్టం చేశారు.

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ మాదిగలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ టిడిపినే అని అన్నారు. టీడీపీలో మాదిగలు మళ్లీ కీలక పాత్ర షోషించటం జరుగుతుందన్నారు. గతంలో సామాజికంగా దగాపడ్డ జాతికి న్యాయం చేయాలని వర్గీకరణ కోసం సోదరుడు మంద కృష్ణ ఉద్యమం చేశారన్నారు. ఆ ఉద్యమ ఫలితాలు నాలుగు సంవత్సరాలు అనుభవించాం అది మనందరికి తెలుసని వర్లరామయ్య పేర్కొన్నారు. మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నాయుడుని కోరామన్నారు. మాదిగలకు కీలక పదవులు ఇవ్వాలని .. జీవో నెం.25 నూటికి నూర్లుపాళ్లు అమలు చేయాలని చంద్రబాబు నాయుడుని కోరామని తెలిపారు. అయితే ఆయన దానికి అంగీకరించి వర్గీకరణకు సహకరిస్తామని చెప్పారన్నారు. కార్పొరేషన్ల విషయంలో కూడా మాదిగలకు పెద్దపీట వేస్తానని చెప్పడంతో మనము ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ మహా కార్యక్రమం ఏర్పాటు చేశాం అన్నారు. మాదిగలంతా ఐక్యంగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసి వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు.