Home Page SliderNational

తమిళ నాడు విద్యాశాఖమంత్రికి 3ఏళ్ల జైలు శిక్ష

Share with

తమిళనాడుకు చెందిన డీఎంకే పార్టీ నేత,ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడికి మద్రాసు హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. కాగా పొన్ముడిపై  ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని గతంలో కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఈ కేసు విషయమై మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు ఆయనకు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కాగా ఆయనతోపాటు ఆయన సతీమణికి రూ.50 లక్షల జరిమానా వేసింది. అయితే పొన్ముడి ప్రస్తుతం మంత్రి పదవిలో ఉన్నారు. దీంతో మద్రాసు హైకోర్టు ఆయనకు 30 రోజుల జైలు శిక్షను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే తన వయస్సు (73)ను పరిగణలోకి తీసుకొని శిక్షను కొంతమేరకు తగ్గించాలని పొన్ముడి మద్రాసు హైకోర్టును కోరినట్లు తెలుస్తోంది.