Home Page SliderNational

రాజస్థాన్‌లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల రచ్చ-సస్పెన్షన్ వేటు

Share with

రాజస్థాన్‌లోని ఉన్నతోద్యోగులమనే ధ్యాస కూడా లేకుండా అజ్మీర్ సమీపంలోని ఏ రెస్టారెంట్లో సిబ్బందితో  అకారణంగా గొడవకు దిగారు ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారి.  వీరి గొడవ దృశ్యాలు వైరల్ కావడంతో వీరిద్దరూ సస్పెన్షన్‌కు గురయ్యారు. వివరాలలోకి వెళితే, ఐఏఎస్ అధికారి గిరిధర్ అజ్మీర్ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్‌గా ఉన్నారు. ఐపీఎస్ అధికారి సుశీల్‌కుమార్ బిష్ణోయ్ ఓఎస్‌డీగా నియమితులయ్యారు. వీరిద్దరిదీ కొత్త నియాయకం. దీనిని సెలబ్రేట్ చేసుకోవాలంటూ వీరు అర్థరాత్రి ఈ రెస్టారెంట్‌కు విందుకు వచ్చారు. స్నేహితులతో కలిసి వచ్చిన వీరు సిబ్బందిని లేపి గొడవపడ్డారు. ఈ సమాచారం అందుకున్న  ఆ రెస్టారెంట్ యజమాని  స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కూడా ఐపీఎస్ అధికారితో కలిసి వచ్చి వారిపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 11 మంది హొటల్ సిబ్బంది గాయపడ్డారు. దీనితో సీసీ టీవి దృశ్యాలు వైరల్ కావడంతో వారిద్దరిపై సస్పెన్షన్ వేటు పడింది.