Andhra Pradesh

లక్ష్మీపార్వతికి సుప్రీం కోర్టు షాక్

Share with

లక్ష్మీపార్వతికి సుప్రీం కోర్టు ఝలక్ ఇచ్చింది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆస్తులపై దర్యాప్తు చేయాలంటూ వేసిన పిటిషన్ కోర్టు డిస్మిస్ చేసింది. ఎవరి ఆస్తులు ఎవరు తెలుసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు అన్ని వాదనలు విన్న తర్వాత కేసు కొట్టేసిందని అభిప్రాయపడింది. లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్‌ను జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ త్రివేది ధర్మాసనం విచారించింది. అసలు ఈ వ్యవహారంలో మీకేం సంబంధమంటూ సుప్రీం కోర్టు లక్ష్మీపార్వతిని నిలదీసింది. తాను సీఎం నందమూరి తారకరామారావు సతీమణి అంటూ లక్ష్మీపార్వతి చెప్పగా… ఈ వ్యవహారాలన్నీ ప్రభుత్వాలు చూసుకుంటాయంటాయని పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. మొత్తంగా లక్ష్మీపార్వతి వాదనపై సుప్రీం కోర్టు నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.