Home Page SliderNational

రాహుల్ పిటిషన్‌పై విచారణకు అంగీకరించిన సుప్రీం

Share with

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. కాగా ఈ నెల 21న దీనిపై విచారణ చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొంది. రాహుల్ గాంధీ తాజాగా సుప్రీమ్ కోర్టు మెట్లు ఎక్కారు. ఎందుకంటే రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సూరత్ ట్రయల్ కోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాహుల్ సుప్రీమ్ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు తనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షను రద్దు చేయాలని కోరుతూ రాహుల్ గాంధీ పిటిషన్ దాఖలు చేశారు.  అయితే ఇటీవల రాహుల్ గాంధీకి సూరత్ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. దీంతో రాహుల్ గాంధీ సుప్రీమ్ కోర్టును ఆశ్రయించారు.కాగా గుజరాత్ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ రాహుల్‌పై పరువు నష్టం దావా వేయడంతో కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.