Home Page SliderTrending Today

సూపర్ స్టార్ మెచ్చిన “దసరా”

Share with

నాచురల్ స్టార్ నాని నటించిన “దసరా” మూవీ మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా సినిమా విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ.. కలెక్షన్ల్ వర్షం కురిపిస్తుంది. అయితే ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా అద్భుతంగా ఉందని,తాను ఈ సినిమా విషయంలో ఎంతగానో గర్విస్తున్నానని ట్విటర్ ద్వారా తెలిపారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. దీంతో నాని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా ఈ ట్వీట్‌కు స్పందించిన దసరా నిర్మాణ సంస్థ మహేష్‌బాబుకు థ్యాంక్య్ చెప్తూ..రిప్లై ఇచ్చారు. ఈ సినిమా నాచురల్ స్టార్ నాని నటించిన మొట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్. కీర్తి సురేష్ కథానాయిక. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. కాగా మార్చి 30 న శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా విడుదలైంది. తెలుగుతోపాటు విడుదలైన అన్నీ భాషల్లోనూ..ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ధరణి ,వెన్నెలగా నాని,కీర్తి సురేష్ నటన అద్భుతంగా ఉందని సినీ ప్రియులు సోషల్ మీడియా వేదికగా  వారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.