Home Page SliderInternational

నేడు కనువిందు చేయనున్న ‘సూపర్ మూన్’

Share with

నేటి రాత్రి ఆకాశంలో అద్భుతం కనిపించబోతోంది. అందాల చందమామ సూపర్ మూన్‌గా దర్శనమివ్వబోతోంది. నేడు గురు పౌర్ణమి కావడం, అందులోనూ భూమికి చంద్రుడు కాస్త దగ్గరగా రానుండడంతో ఈ దృశ్యం ఆవిష్కృతమవుతుంది. సాధారణ చంద్రుని కన్నా 14 శాతం పెద్దదైన, 30 శాతం ప్రకాశవంతమైన చందమామను చూడబోతున్నాము. చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరగడం వల్ల కొన్ని సమయాలలో దగ్గరగా వస్తూండడం సాధారణమే. దగ్గరగా వచ్చినప్పుడు భూమికి 3,61,934 కిలోమీటర్ల దూరంలో చంద్రుడు ఉంటాడు. దూరంగా ఉన్నప్పుడు 3,84,400 కిలోమీటర్ల దూరం ఉంటాడు.  దగ్గరగా వచ్చినట్లయితే పెరీజీ అనీ, దూరంగా ఉన్నప్పుడు అపోజీ అనీ అంటారు. ఈ సూపర్ మూన్‌లు సంవత్సరానికి 12 సార్లు ఏర్పడతాయి. కానీ ఈ సంవత్సరం ఆగస్టులో రెండుసార్లు పూర్ణచంద్రుని దర్శనం కాబోతోంది. దీనివల్ల 13 సార్లు ఈ సూపర్ మూన్‌ను చూడవచ్చు.