Andhra PradeshHome Page Slider

ఏపీలో సబ్సిడీ టమాటాలు..ఎగబడ్డ ప్రజలు

Share with

 దేశంలో గతకొన్ని రోజులుగా టమాటా ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. దీంతో టమాటాలు కొనాలంటేనే సామాన్యులు భయపడుతున్నారు.కాగా  ప్రస్తుతం మార్కెట్‌లో కిలో టమాటా ధర రూ.200 వరకు పలుకుతోంది.  ఈ నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ధరకే టమాటాలు అందిస్తున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం కూడా రైతు బజార్లలో రూ.50కే కిలో టమాటాలు అందిస్తుంది. కాగా ఈ టమాటాల కోసం ప్రజలు రైతు బజార్లకు పోటెత్తుతున్నారు. తాజాగా ఈ టమాటాల కోసం కర్నూల్‌లో దాదాపు 2 కిలోమీటర్ల మేర ప్రజలు బారులు తీరారు. దీంతో గంటల వ్యవధిలోనే 3టన్నుల టమాటా అమ్ముడైపోయింది. కాగా నిన్న విజయవాడ, గుంటూరు, ఈ రోజు ఆదోనిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అయితే నాలుగైదు రోజుల తర్వాత సబ్సిడీ టమాటాలు రావడంతో ఈ పరిస్థితి వచ్చిందని ప్రజలు చెబుతున్నారు.