Andhra PradeshHome Page Slider

వర్కింగ్ క్యాపిటల్ కోసం నిరర్థక ఆస్తులు అమ్మకానికి పెట్టిన స్టీల్‌ప్లాంట్

Share with

ఒకప్పుడు వైభవంగా వెలిగిపోయిన విశాఖ స్టీల్‌ప్లాంట్ నేడు వర్కింగ్ క్యాపిటల్ కోసం ఆస్తులను అమ్మకానికి పెడుతోంది. నిరర్థక ఆస్తులయిన 25 ఎకరాల స్థలంలోని కార్మికుల ఇళ్లను, క్వార్టర్లను అమ్మకానికి పెట్టింది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు 10 రోజులలో సంప్రదించమంటూ ప్రకటన ఇచ్చింది. నిరుపయోగంగా ఉన్న ఆక్రమణకు గురవుతున్న ఈ ఆస్తులను అమ్మి తన పూర్తి సామర్థంతో పని చేయడానికి శక్తి కూడగట్టుకోవాలని ఆలోచిస్తోంది. గతంలో బిడ్లు కూడా వేసింది. ఇంకా నాలుగువేల కోట్ల రూపాయలు కావలసి ఉంది. స్టీల్ ప్లాంట్‌కు సహాయం చేస్తామని చెప్పిన తెలంగాణా సర్కార్ ముఖం చాటేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలే పట్టించుకోవట్లేదు. దీనితో స్వయంగా నిలదొక్కుకునే ప్రయత్నంలో భాగంగా రెండువేలకోట్ల రూపాయల విలువైన ఆస్తులను సేల్‌కి పెడుతోంది స్టీల్‌ప్లాంట్.