Home Page SliderNational

తెలుగు ఎంపీల చేతుల్లో ఉక్కు శాఖ..మరి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగుతుందా?

Share with

తెలుగు ఎంపీల చేతుల్లో ఉక్కు శాఖ..మరి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగుతుందని ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. తెలుగు ఎంపీలు కేంద్రంలో ఉక్కు శాఖా మంత్రులుగా ఎంపిక కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్లుగా విశాఖ ఉక్కు పరిశ్రమ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ప్రైవేటీకరణ దిశగా కేంద్రప్రభుత్వం అడుగులు వేయడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు. విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేస్తున్నారు. అయితే ఈమధ్య జరిగిన లోక్‌సభ ఎన్నికలలో తెలుగువారి బలం పెరిగింది. కేంద్రప్రభుత్వానికి తెలుగు ఎంపీలు వెన్నుముకగా మారారు.

తెలంగాణ నుండి బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి ఉక్కు,బొగ్గుగనుల శాఖా మంత్రిగా బాధ్యతలు తీసుకోగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీనివాసవర్మ ఉక్కుశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మరి ఈఇద్దరు మంత్రులు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటారా? తెలుగువారికి విశాఖ స్టీల్‌ను తిరిగి అందిస్తారా ?అనేది చర్చనీయాంశంగా మారింది. విశాఖ ఉక్కు విషయంలో విశాఖ ఉక్కు ఉద్యోగులకు హామీ ఇచ్చేలా కేంద్రప్రభుత్వంతో మాట్లాడుతానని వర్మ హామీ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంటు కోసమే టీడీపీ కూటమిని ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారని వారి కోరికను మన్నించాలని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కోరుతున్నారు.