Home Page SliderNational

 మెగా ప్రిన్సెస్ “క్లీంకారా” కోసం స్పెషల్ రూమ్

Share with

రామ్ చరణ్-ఉపాసన జూన్ 20న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ పాపకు “క్లీంకారా” అని నామాకరణం కూడా చేశారు. కాగా ఇప్పుడు క్లీంకారా కోసం ఉపాసన ఓ స్పెషల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఆ రూమ్‌లో తన కుమార్తె చుట్టూ ఆహ్లాదకర వాతావరణం ఉండేలా ఇంటీరియర్ సిద్ధం చేయించినట్లు తెలిపారు. కాగా ఆ స్పెషల్ రూమ్‌కు సంబంధించిన వీడియోను ఉపాసన తన ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ రూమ్‌ను ప్రముఖ ఆర్కిటెక్ పవిత్రా రాజారామ్ నేతృత్వంలో కామినేని నివాసంలో స్పెషల్‌గా డిజైన్ చేయించారు.అయితే అమ్రాబాద్ ఫారెస్ట్,వేదిక్ హీలింగ్ వంటి అంశాలను స్పూర్తిగా తీసుకొని దీనిని డిజైన్ చేసినట్లు పవిత్రా రాజారామ్ ఈ వీడియోలో తెలిపారు. కాగా ఈ వీడియోలో అపోలో ఆసుపత్రిలోని ఉపాసన డెలివరీ రూమ్‌ను కూడా చూపించారు. ఈ రూమ్‌ను కూడా పవిత్రా రాజారామ్ తన బృందంతో కలిసి డిజైన్ చేసినట్లు పేర్కొన్నారు.